Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ముఖానికి రంగేసుకోనున్న పవర్ స్టార్.. క్రిష్‌తో సినిమా? (Video)

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (15:11 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. పవన్ ప్రస్తుతం సినిమాలకు స్వస్తి పలికి ప్రజాజీవితంలో బిజీగా ఉన్నారు. ఆయన తిరిగి సినిమాలలోకి రావాలని అభిమానులే మాత్రమే గాక నిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా ఫిలిం వర్గాల సమాచారం మేరకు.. కాన్సెప్ట్ బేస్ చిత్రాలను తీస్తూ తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు 'క్రిష్' దర్శకత్వంలో పవన్ నటించనున్నాడట. 
 
ప్రజల మెరుగైన జీవితాల కోసం పోరాడే యోధుడు కథని పవన్ ఓకే చేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ కొద్దిపాటి గ్యాప్‌తో క్రిష్ మళ్లీ కొత్త సినిమా చేయాలనుకుంటున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో.. ఈసారి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
 
మరోవైపు పవన్‌తో గబ్బర్ సింగ్ సినిమా తీసి హిట్ అందుకున్న హరీష్ శంకర్ కూడా ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ అని టాక్. మరి రీమేక్ స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్ పవర్ స్టార్‌తో ఆ హిట్ మేనియా కొనసాగిస్తాడో.. క్రిష్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments