గుండెల్ని పిండేస్తున్న ఐశ్వర్యారాయ్ భర్త కామెంట్స్...

Webdunia
బుధవారం, 23 జనవరి 2019 (13:27 IST)
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇపుడు ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. కొన్ని సంవత్సరాల పాటు హీరోగా నటించిన అభిషేక్... హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడుగా బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన ప్రతిభతో సినీ ఇండస్ట్రీతో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా కొంతకాలంగా సినీ అవకాశాలు లేక ఇంటికే పరిమితమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు సహాయ నటుడి పాత్రలను పోస్తున్నాడు. దీనిపై అభిషేక్ బచ్చన్ ఓ పోస్ట్ చేశాడు. కొన్నేళ్ళపాటు హీరోగా చేసిన ఇపుడు సహాయ నటుడి పాత్రు పోషించడం గుండెలను పిండేసే విషయమన్నారు. 
 
తాజాగా ఆయన 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న అభిషేక్... గత సంవత్సరం సెప్టెంబరులో తాను సైడ్ క్యారెక్టర్ చేసిన 'మన్మర్జియా' చిత్రం ప్రస్తావనకు వచ్చిన వేళ, అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
హీరోగా చేసే వారు సైడ్ క్యారెక్టర్‌గా చేయాల్సి రావడం చాలా కష్టమైన విషయమని, సినీ ఇండస్ట్రీ చాలా దారుణమైన ప్రదేశమన్నారు. ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదని, రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుందన్నారు. ఆ బాధ నుంచే స్ఫూర్తి పొందాలని, తిరిగి సెంటర్‌లోకి వచ్చేందుకు కృషి చేయాలని అన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments