Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల చనిపోవడానికి కారణం ఏంటి? వెల్లడించిన కిమ్స్ వైద్యులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:13 IST)
ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. మంగళవారం సాయంత్రం 4.07 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. నవంబరు 24వ తేదీన అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన... చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన మృతికి గల కారణాలను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు వివరించారు. 
 
ఇదే అంశంపై ఆస్పత్రి ఎండీ భాస్కర్ రావు మాట్లాడుతూ, గత ఆరేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఊపిరితిత్తుల ఆపరేషన్ చేసి కొంతభాగం తొలగించామన్నారు. పైగా బైపాస్ సర్జరీ కూడా చేసినట్టు చెప్పారు. 
 
వారం రోజుల క్రితం కూడా కేన్సర్ వస్తే అందులో కూడా సగం తీయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆయన రెండు రోజుల పాటు బాగానేవున్నారని చెప్పారు. కానీ, ఇంతలోనే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దీంతో అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్‌కు తీసుకొచ్చారన్నారు. 
 
కిమ్స్ ఆస్పత్రిలో రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత ఆయన బాగానే ఉన్నారన్నారు. దీంతో ఆయనకు ప్రీకాస్టమీ చేశామనీ, 45 శాతం ఊపిరితి తిత్తులు తీసేశాసమని, మిగిలిన 55 శాతం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ఈ కారణంగా ఆయన్ను ఎక్మో మిషన్‌పై పెట్టామని, గత ఐదో రోజులుగా ఇదే తరహా చికిత్స చేస్తూ వచ్చామన్నారు. 
 
ఒకవైపు కేన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ డ్యామేజ్‌తో పాటు ఊబకాయం కూడా ఒక సమస్య కావడంతో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. వీటివల్లే సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments