Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరివెన్నెల భౌతిక కాయానికి రేపు అంత్య‌క్రియ‌లు

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (21:20 IST)
seetarama sastry
ఈరోజు సాయంత్రం మ‌ర‌ణించిన సిరివెన్నెల' సీతారామశాస్త్రి మ‌ర‌ణం యావ‌త్తు సినీరంగాన్ని క‌ల‌చివేసింది. ఆయ‌న్ను క‌డ‌సారి చూసేందుకు వీలుగా కుటుంబ‌స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న భౌతిక‌కాయం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప్ర‌తిలోనే వుంది. ఈ రాత్రి అక్క‌డే వుంటుంది. రేపు అన‌గా బుధ‌వారంనాడు ఉద‌యం 7గంట‌ల‌కు ఆయ‌న భౌతిక కాయం సినీ ప్ర‌ముఖుల సంద‌ర్శ‌నార్థం జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో ఉంచ‌నున్న‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.
 
నిర్మాత‌ల మండ‌లి సంతాపం
 
ఇటీవ‌లే శివైక్యం చెందిన కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి ప‌ట్ల సినీ ప‌రిశ్ర‌మ దుఃఖ సాగ‌రంలో వుంది. ఇలాంటి టైంలో మ‌రో చేదు వార్త వినాల్సి వ‌చ్చింది. ఎన్నో సినిమాల్లో తెలుగు సాహిత్యానికి కొత్త ఒర‌వ‌డిని తెచ్చిన సీతారామశాస్త్రి గారి మ‌ర‌ణం తీర‌నిలోట‌నీ, వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసింది.
 
Telugu Film Journalists Association
తెలుగు సినిమా జ‌ర్న‌లిస్టుల సంఘం సంతాపం
భారతీయ చలనచిత్ర రచనలో ఒక లెజెండ్. తెలుగు సినిమా మహాకవి #సిరివెన్నెల సీతర్మశాస్త్రి మరణం తీరని లోటు. సాహిత్య ప్రపంచానికి, తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. కానీ ఆయన రచనలు ఎప్పటికీ మనలో నిలిచిపోతాయి- అని తెలుగు సినిమా జ‌ర్న‌లిస్టుల సంఘం  సంతాపం తెలిపింది. ఆయ‌న‌కు ప‌ద్మ అవార్డు ద‌క్కిన సంద‌ర్భంగా తెలుగు సినిమా జ‌ర్న‌లిస్టుల సంఘం స‌న్మానించింది. సినీ సాహిత్యం పెడ‌దారి ప‌డుతుంద‌ని మీలాంటి పెన్నులు రాస్తేనే స‌రైన సాహిత్యం ముందుకు వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments