Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల

నమ్మకు నమ్మకు ఈ రేయినీ.. అంటూ కానరాని లోకాలకు సిరివెన్నెల
, మంగళవారం, 30 నవంబరు 2021 (17:39 IST)
Siri vennela
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామశాస్త్రి కన్నుమూయడం అత్యంత విషాదకరం. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురకావడం.. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లడం ఆయన పాటలను ప్రేమించే కోట్లాది అభిమానులను కలిచివేసిందనే చెప్పాలి. 
 
సీతారామశాస్త్రి విషయానికొస్తే.. ఈయన 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కవి, రచయిత, గాయకుడు, నటుడు. సినీ గేయ ర‌చ‌యిత‌గా బాలకృష్ణ హీరోగా కళా తపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనని జన్మభూమి’ సినిమాతో గేయ రచయతగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు
 
ఈ మధ్యకాలంలో,  జైలు పక్షి, ఆది దంపతులు, లేడీస్ టైలర్ లాంటి సినిమాలకు కూడా పాటలు రాసారు సీతారామశాస్త్రి. ఆ తర్వాత కే.విశ్వనాథ్ 1986లో తెరకెక్కించిన ‘సిరివెన్నెల’ సినిమాకు అన్ని పాటలను సీతారామశాస్త్రి రాశారు. ఈ సినిమాతో చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ఆయన  కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుందాం... 
 
ఆరంగేట్రం సిరివెన్నె లోని ప్రతి పాట అణిముత్యమే.
స్వయంకృషిలోని పాటలు
 
రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈ రేయినీ, జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినదీ
స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశంలో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిది
శృతిలయలులో - తెలవారదేమో స్వామి
శివలో బోటని పాఠముంది
 
క్షణక్షణంలో కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా
గాయంలో అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు, రాష్ట్ర నంది అవార్డు సాధించిన స్వరాజ్యమవలేని
గులాబిలో ఏ రోజైతె చూశానో నిన్నూ, క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ
మనీలో చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ
శుభలగ్నం లోని చిలకా ఏ తోడు లేకా
 
నిన్నే పెళ్ళడతా లోని కన్నుల్లో నీ రూపమే, నిన్నే పెళ్ళాడేస్తానంటూ
సింధూరం లోని అన్ని పాటలు ముఖ్యంగా - సంకురాత్రి పండగొచ్చెరో, అర్థ శతాబ్దపూ
దేవీపుత్రుడు లోని ఓ ప్రేమా
 
చంద్రలేఖ లోని ఒక్క సారి ఒక్క సారి నవ్వి చూడయ్యో
నువ్వే కావాలి నుంచి ఎక్కడ ఉన్నా, కళ్ళలొకి కళ్ళు పెట్టీ
నువ్వు నాకు నచ్చావు నుంచి ఆకాశం దిగివచ్చి
 
శుభ సంకల్పం నుంచి హైలెస్సో, సీతమ్మ అందాలూ
పట్టుదల నుండి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌గమంత కుటుంబంలో ఏకాకిని నేనంటూ నిష్క‌మించిన సీతారామ‌శాస్త్రి