Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 78 రోజులపాటు ఏం జరిగిందో చెప్తా! : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

Webdunia
మంగళవారం, 21 మే 2019 (17:11 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురట్చితలైవి జయలలిత. ఈమెకు అత్యంత ఆత్మీయ సన్నిహితురాలు శశికళ జీవితం ఆధారంగా "శశిలలిత" సినిమా తెరకెక్కుతోంది. 'జయం' మూవీస్ అధినేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కాజల్ దేవగన్, శశికళ పాత్రలో అమలా పాల్ నటించబోతున్నారని కేతిరెడ్డి చెప్పారు. 
 
ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన ఆయన.. "శశిలలిత" సినిమా ద్వారా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూపించ బోతున్నామని తెలిపారు. ఈ సినిమా ద్వారా పలు యదార్థ సంఘటనలు తెరకెక్కించనున్నామనీ.. 78 రోజులు హాస్పిటల్‌లో ఏం జరిగిందో చెప్పబోతున్నామని చెప్పుకొచ్చారు. 
 
జయలలిత బాల్యం నుండి చిత్ర పరిశ్రమకు రావడం, శోభన్ బాబుతో ఆవిడ ప్రేమ వ్యవహారం, ఇలాంటి అన్ని అంశాలూ ఇందులో కవర్ చేస్తామని చెప్పారు. జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలన్నింటినీ రెండన్నర గంటల్లో వివరించబోతున్నామనీ... ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను... కోడ్ తొలగిన వెంటనే విడుదల చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments