Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి అమలా పాల్ కిడ్నాప్?!

Advertiesment
కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసి అమలా పాల్ కిడ్నాప్?!
, బుధవారం, 10 ఏప్రియల్ 2019 (11:29 IST)
సౌత్‌లో హల్‌చల్ చేస్తున్న మలయాళ బ్యూటీ అమలాపాల్. తన భర్త నుంచి విడిపోయిన తర్వాత పలు వరుస మూవీల్లో నటిస్తోంది. తాజాగా ఈమె కిడ్నాప్‌కు గురైంది. కాళ్లు చేతులూ తాళ్ళతో కట్టేసి అటవీ ప్రాంతంలోకి కిడ్నాప్ చేశారు. ఈ మేరకు తన కిడ్నాప్ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అమలాపాల్ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పేరు "అదో అంద పరవై పోల" (అదో ఆ పక్షిలాగా). ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఆమె కాళ్లు చేతులు కట్టేసి.. ఓ అటవీ ప్రాంతంలో కూర్చోబెట్టారు. దీన్ని ఆమె ఫోటో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. 
 
ఈ మూవీతో కేఆర్‌ వినోద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో అమలాపాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్వెంచర్, థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కూడా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. 
 
ఇందులో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఆమె ఓ అడవిలో రైడింగ్‌కు వెళ్లి చిక్కుకుంటారు. అక్కడ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అక్కడి క్రూరమృగాల నుంచి ఆమె ఎలా తప్పించుకున్నారన్నదే చిత్ర కథ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కల్కి' టీజర్.. భలే ముహూర్తం పెట్టారే..!