'ఎఫ్ 2' ఇచ్చిన విజయంతో తమన్నాకు వరుస ఆఫర్లు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటికే 'దేవి 2, దట్ ఈజ్ మహాలక్ష్మి' వంటి సినిమాలలో లీడ్ రోల్స్ చేస్తున్న ఆమె తాజాగా విశాల్ హీరోగా రూపొందనున్న ఒక కొత్త సినిమాకి సైన్ చేసారట.
కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ పాత్రకు కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ఈ పాత్ర గురించి చెప్పుకొచ్చిన మిల్కీ బ్యూటీ ఇది పూర్తిగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మైండ్‌గేమ్ ఆడే ఒక అమ్మాయి పాత్ర అనీ... ఈ పాత్ర అంత సులభంగా ఉండబోదనీ, తనలోని నటికి ఇదొక పరీక్ష అని చెప్పుకొచ్చింది.
ఇంతకీ ఈ పాత్రని మిల్కీ బ్యూటీ ఎలా పోషించబోతోందో.. వేచి చూడాల్సిందేగా మరి...