మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా 'సమ్మోహన'పరిచిన హీరోయిన్

బుధవారం, 20 మార్చి 2019 (09:57 IST)
అదితి రావు హైదరీ. "సమ్మోహనం" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో అదితి న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ముగ్ధుల‌య్యారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "అంత‌రిక్షం" అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అలాగే, ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్న ప్రొడక్షన్ నంబరు 26లో కూడా అదితి రావు హైదరీ ఎంపికైంది. 
 
ఇదిలావుంటే... టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూప్ తయారు చేసిన జాబితాలో అదితి మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మ‌డికి ద‌క్క‌గా రెండో స్థానంలో ఎఫ్‌బీబీ క‌ల‌ర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018 శ్రియా రావు నిలిచింది. 
 
స‌మంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2017 లో తొలి స్థానం ద‌క్కించుకున్న పూజా హెగ్డేకి ఈ సారి నాలుగో స్థానం ద‌క్కింది. ఐదు ర‌ష్మిక‌, ఎనిమిదో స్థానంలో కైరా అద్వానీ, తొమ్మిది ర‌కుల్‌, ప‌దో స్థానంలో కాజల్ అగర్వాల్ ఉంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హోటల్ బిల్లు చూసి పత్తాలేకుండా పారిపోయిన హీరోయిన్