Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ దర్శకుడితో కీర్తి సురేష్ తెలుగు సినిమా.. అజయ్ దేవగన్‌తో జోడీ

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (18:19 IST)
బాలీవుడ్ దర్శకుడు నాగేష్ కుక్కునూర్ టాలీవుడ్‌ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంటరవుతున్నాడు. హైదరాబాద్ బ్లూస్, బాంబే టు బ్యాంకాక్, ధనక్ లాంటి విభిన్న సినిమాలను రూపొందించిన నాగేష్ కుక్కునూర్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఈయన బాలీవుడ్‌లో సెటిలయ్యారు. తాజాగా తెలుగులో తొలి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. 
 
'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారిగా నాగేష్ దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయింది. ఆది సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో జగపతిబాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వర్త్ ఏ షాట్ ఆర్ట్స్ అనే కొత్త బేనర్ నుంచి మొట్టమొదటి సినిమాగా రానున్న ఈ ప్రాజెక్టుకి ఇంకా ఖరారు కాలేదు. సుధీర్, శ్రావ్య వర్మ నిర్మాతలు. సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు.
 
ఇది స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీ అని, రొమాన్స్ అండ్ కామెడీ మిళితమైన విభిన్నమైన కథాంశమని తెలుస్తోంది. ఇప్పటికే క్రికెట్ సంబంధిత కంటెంట్‌తో మజిలీ, జెర్సీ మూవీలు తెలుగు ప్రేక్షకుడ్ని ఆకట్టుకున్నాయి. ఇదే సీక్వెన్స్‌లో కీర్తి సురేష్- కుకునూర్ ప్రాజెక్టు కూడా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
 
ఇకపోతే.. కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాకు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో స్టార్ హీరో అజయ్ దేవగన్‌కు జోడిగా నటించనుంది కీర్తి. మాజీ ఇండియన్ జాతీయ ఫుట్ బాల్ టీం కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘బడాహీ హో’ ఫేమ్ అమిత్ షా దర్శకత్వం వహించనున్నారు. 
 
ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ జూలైలో ప్రారంభమై నవంబర్‌లో ముగియనుంది. ఫ్రెష్ లైమ్ ఫిలిమ్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనునున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments