Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుగులేని ఛాన్సులతో తారాపథంలో దూసుకెళుతున్న రష్మిక మందన్న

Advertiesment
తిరుగులేని ఛాన్సులతో తారాపథంలో దూసుకెళుతున్న రష్మిక మందన్న
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:51 IST)
కన్నడ భామ రష్మిక మందన్నా. ఏ ముహుర్తాన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో లేదోగానీ ఈ అమ్మడు దశ తిరిగిపోయింది. వరుస ఛాన్సులతో తారాపథంలో దూసుకెళుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ అమ్మడి చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. దక్షిణాదిలో అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
 
తాజాగా ఈ సొగసరి బాలీవుడ్ అరంగేట్రానికి వేదిక సిద్ధమైనట్లు తెలుస్తుంది. హిందీలో ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రణదీప్‌ హుడా కథానాయకుడిగా నటించబోతున్న ఈ సినిమా ద్వారా రచయిత బల్విందర్‌ సింగ్ జనూజా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పోలీస్ నేపథ్య యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రష్మికకు కథ వినిపించారని, ఆమె అంగీకారం కోసం చిత్రబృందం ఎదురుచూస్తున్నదని అంటున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ వంటి అగ్ర నిర్మాత చిత్రం కావడంతో రష్మిక ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో విజయ్‌దేవరకొండ సరసన "డియర్ కామ్రేడ్" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో విడుదలకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోయ‌పాటి బర్త్ డేకి బాలయ్య షాకింగ్ గిఫ్ట్... ఏంటది?