Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరి నాట్లు వేస్తున్న తమిళ హీరోయిన్ : సెలెబ్రిటీలకు షాక్!

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (13:50 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశంలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ లాక్డౌన్ సమయంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు వివిధ రకాల ఇంటి పనులు చేస్తూ టైంపాస్ చేశారు. పైపెచ్చు.. తాము చేసిన పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. ఫలితంగాఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. అయితే, ఇలాంటి వీడియోలపై పలువురు రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రైతులు పడుతున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలంటూ ప్రాధేయపడ్డారు. అంతేకానీ, సెలెబ్రిటీలు అంట్లు తోమే వీడియోలతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ప్రణీత వంటి అతికొద్ది మంది హీరోయిన్లు ఇలాంటి పబ్లిసిటీకి దూరంగా ఉంటా అనేక పేదల ఆకలిని తీర్చింది. మరికొందరు తమకు తోచిన సాయం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ హీరోయిన్ ఏకంగా రైతుగా మారిపోయింది. ఈ లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయం చేయడమేకాదు.. ఏకంగా వరినాట్లు కూడా వేసింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్క సెలెబ్రిటీ షాక్‌కు గురయ్యారు. ఆమె పేరు కీర్తి పాండ్యన్. ప్రముఖ హీరో అరుణ్ పాండ్యన్ కుమార్తె.
 
'తుంబ' అనే చిత్రం ద్వారా తెలుగు వారికీ పరిచయమైంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. లాక్‌డౌన్‌తో షూటింగులు ఆగిపోవ‌డంతో సొంతూరుకు వెళ్లిన కీర్తి వ్యవసాయ పనులు ప్రారంభించింది. ట్రాక్ట‌ర్‌తో పొలం దున్నింది. స్వయంగా పొలంలోకి దిగి నాట్లు వేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రైతుగా మారి ఆమె అందరికీ గొప్ప సందేశాన్ని ఇచ్చిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments