కస్తూరిపై కేసు.. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో..?

దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. తమిళనాడులో 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్ప

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (10:49 IST)
దక్షిణాది సీనియర్ నటి కస్తూరి ప్రస్తుతం చిక్కుల్లో పడింది. హిజ్రాలపై నోరు పారేసుకోవడంతో ఆమెపై కేసు నమోదైంది. తమిళనాడులో 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ స్పందించడంపై నటి ఇబ్బందుల్లో చిక్కుకుంది. 
 
మూడు రోజుల క్రితం అనర్హత కేసులో తీర్పు వెలువడగా, తమిళంలో హిజ్రాలను సంబోధించే ఒంబోదు.. అనే పదాన్ని వాడుతూ కస్తూరి ఓ ట్వీట్ పెట్టింది. కోర్టు తీర్పు అటూ ఇటూ కానిదన్న అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలపై హిజ్రాలు భగ్గుమన్నారు.
 
మైలాపూర్‌లోని కస్తూరి ఇంటి ఎదుట తీవ్ర నిరసన తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము కూడా సగటు మనుషులమేనన్న సంగతిని కస్తూరి మరచిందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని హిజ్రాల సంఘాలు డిమాండ్ చేశాయి. హిజ్రాలు ఇచ్చిన ఫిర్యాదుపై మధురై, చెన్నై తదితర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కస్తూరిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments