Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. బాహుబలికి అవార్డుల పంట..

హైదరాబాద్‌‍లో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగనుంది. తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలుగులో ''బాహుబ‌లి

Webdunia
ఆదివారం, 17 జూన్ 2018 (10:25 IST)
హైదరాబాద్‌‍లో 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగనుంది. తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలుగులో ''బాహుబ‌లి-2'' చిత్రం 8 అవార్డులను కొల్లగొట్టగా, అర్జున్‌ రెడ్డి చిత్రానికిగాను ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంపికయ్యారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణకి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. 
 
ఇక తెలుగులో ఉత్తమ చిత్రంగా బాహుబలి-2 నిలువగా, ఉత్తమ దర్శకుడిగా అదే చిత్రానికి గాను ఎస్ఎస్ రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), ఉత్తమనటిగా సాయిపల్లవి (ఫిదా), ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ (బాహుబలి 2), ఉత్తమ సహాయ నటుడిగా రానా దగ్గుబాటి (బాహుబలి 2), ఉత్తమ నటి (తొలి పరిచయం)గా కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) అవార్డులు పొందారు. 
 
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్ కుమార్ (బాహుబలి 2), ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా శేఖర్ మాస్టర్ (ఫిదా), ఉత్తమ గేయ రచయితగా ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా పాటకు), ఉత్తమ నేపథ్య గాయకుడిగా హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్), ఉత్తమ నేపథ్య గాయనిగా మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్), ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2), ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ (బాహుబలి 2) అవార్డులు అందుకున్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments