నేను భయపడినంత జరిగింది.. వెళ్లొద్దని మా నాన్నకు చెప్పాను..
నాగ్‌పూర్‌లో వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు.. ఆయన కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా తప్పుబడుతున్నారు.
నాగ్‌పూర్‌లో వేదికగా జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడంపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు.. ఆయన కుమార్తె షర్మిష్ట ముఖర్జీ కూడా తప్పుబడుతున్నారు. ఈ సమావేశానికి వెళ్లడం వల్ల లేనిపోని సమస్యలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే హెచ్చరించినట్టు ఆమె గుర్తుచేశారు.
ప్రణబ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చిన తర్వాత ఓ మార్ఫింగ్ ఫొటో చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలో ప్రణబ్.. ఆరెస్సెస్ ప్రార్థన చేసే సమయంలో కుడిచేతిని ఛాతీకి సమాంతరంగా ఎలా ఉంచుతారో అలా చేసినట్లుగా ఉంది. నిజానికి ప్రార్థన సమయంలో ప్రణబ్ అలా చేయలేదు. దీనికి సంబంధించిన అసలు, నకిలీ ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. బీజేపీ-ఆరెస్సెస్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతారని తెలిసే ముందే ప్రణబ్‌ను హెచ్చరించానని ఆయన కూతురు షర్మిష్ఠ అన్నారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, నేను భయపడినంత జరిగింది. అందుకే అక్కడికి వెళ్లొద్దని మా నాన్నకు చెప్పాను. కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే బీజేపీ ఇలా చిల్లర రాజకీయాలకు తెరతీసింది అంటూ అసలు, నకిలీ ఫొటోలు ఉన్న ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. నకిలీ కథనాలను సృష్టించేందుకు ఆరెస్సెస్‌కు ప్రణబ్ ఓ అవకాశం ఇస్తున్నారని గురువారమే షర్మిష్ఠ అన్నారు. ఆమె ఊహించినట్లే ప్రణబ్ నాగ్‌పూర్ వెళ్లకముందే ఆమె బీజేపీలో చేరబోతున్నదన్న పుకార్లు మొదలయ్యాయి. దీనిని షర్మిష్ఠ ఖండించారు. కాంగ్రెస్‌ను వీడటం కంటే.. రాజకీయాలనే వదిలేస్తానని ఆమె తేల్చిచెప్పారు.