Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండల్లో దారితప్పిన బాలీవుడ్ యువ హీరో

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:42 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ హీరో దారితప్పిపోయాడు. అక్కడ నుంచి బయటపడేందుకు తన కారులో చక్కర్లు కొడుతుండగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ గుర్తుపట్టి దారి చూపాడు. ఈ సందర్భంగా ఆ హీరోతో కానిస్టేబుల్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ఇపుడు వైరల్ అయింది. తప్పిపోయిన బాలీవుడ్ హీరో పేరు కార్తీక్ ఆర్యన్. 
 
పలు హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరుతో పాటు గుర్తింపు పొందాడు. ఈయన త‌న లేటెస్ట్ మూవీ "ఫ్రెడ్డీ" కోసం మహారాష్ట్రలోని మ‌హాబ‌ళేశ్వ‌ర్ స‌మీపంలో ఉండే పంచ్‌ఘ‌నీ అనే ప్రాంతానికి వెళ్లాడు. 
 
ఈ క్ర‌మంలో అలా స‌రదాగా అక్క‌డి ప్ర‌కృతిని ఎంజాయ్ చేయ‌డానికి కారులో బ‌య‌ట‌కు వెళ్లిన అత‌డు.. తిరిగి వెళ్లే స‌మ‌యంలో దారి త‌ప్పాడు. దారి కోసం వెతుకుతున్న అత‌న్ని అక్క‌డే ఉన్న పోలీసులు గుర్తుప‌ట్టారు. అత‌నికి దారి చూపిస్తూ.. ప‌నిలో ప‌నిగా సెల్ఫీలో దిగ‌డానికి పోటీలు ప‌డ్డారు. 
 
కార్తీక్ ఆర్య‌న్‌ను చూసిన ఓ పోలీస్ వెంట‌నే మొబైల్ ఫోన్ తీసి సెల్ఫీకి రెడీ అయిపోయాడు. అంతేకాదు స‌న్‌గ్లాసెస్ తీయ‌మ‌ని కూడా అత‌డు కార్తీక్‌ను అడ‌గ‌డం విశేషం. సెల్ఫీలు దిగ‌డం పూర్త‌యిన త‌ర్వాత అత‌నికి దారి చూపించి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments