Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా అతిథుల(ఐటీ)తో బిజీగా ఉన్నా... నా ప్రయాణం కొనసాగుతుంది... సోనుసూద్

నా అతిథుల(ఐటీ)తో బిజీగా ఉన్నా... నా ప్రయాణం కొనసాగుతుంది... సోనుసూద్
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:39 IST)
బాలీవుడ్ విలన్ నటుడు సోనుసూద్. మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఈ పేరు తెలియనివారుండరు. కరోనా కష్టకాలంలో ఈ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ తన శక్తిమేరకు ఆదుకునేందుకు ప్రయత్నించారు. అనేక మంది కంటికి ప్రభుత్వాలకంటే సోనుసూదే ఆపద్బాంధవుడుగా కనిపించారు. సాయం అడిగిన ఏ ఒక్కరికీ కాదనకుండా తన ఛారిటీ ద్వారా అండగా నిలిచారు. కోట్లాది రూపాయల తన సొంత డబ్బును సమాజసేవకు ఆయన ఖర్చు చేశారు. ఆస్తులను తాకట్టు పెట్టారు. 
 
అలాంటి సోనుసూద్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షకట్టింది. తమ కనుసన్నల్లో ఉండే ఆదాయపన్ను శాఖను ఉసిగొల్పింది. దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ముంబైలోని ఆయన నివాసంతో పాటు జైపూర్, నాగపూర్‌లలో ఐటీ సోదాలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సోను ఛారిటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తయిన తర్వాత రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ప్రకటించారు.
 
అయితే, ఈ సోదాల తర్వాత సోను సోమవారం తొలిసారి స్పందించారు. "ప్రతిసారి నీ గురించి నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలను సమయం చెపుతుంది. దేశ ప్రజలకు నా శక్తి మేరకు సేవ చేయాలని మనస్పూర్తిగా నిర్ణయించుకున్నా. నా ఫౌండేషన్‌లో ఉన్న ప్రతి రూపాయి కూడా ఒక విలువైన జీవితాన్ని కాపాడటం కోసం, అవసరమైన వారిని ఆదుకోవడం కోసం ఎదురు చూస్తోంది.
 
వివిధ ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చే డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని నా బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తుంటా. ఇప్పటికీ అదే జరుగుతోంది. గత నాలుగు రోజులుగా నా అతిథుల (ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నా. అందువల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు మళ్లీ తిరిగివచ్చాను, నా ప్రయాణం కొనసాగుతుంది" అంటూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ షోకు సల్మాన్ పుచ్చుకునే పారితోషికం ఎంతో తెలుసా?