Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న ఆఫీసులు... నేడు నివాసాలు : సోనూసూద్‌పై ఐటీ గురి

Advertiesment
IT Officials Raid
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడుగా ఉన్న బాలీవుడ్ నటుడు సోనూసూద్‌పై ఐటీ శాఖ గురిపెట్టింది. బుధవారం ముంబైలోని ఆరు ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెండోరోజైన గురువారం ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. 
 
లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో సోనూ చేసుకున్న ఒప్పందాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీల్‌కు‌ సంబంధించి పన్ను ఎగవేశారన్న ఆరోపణలు వచ్చాయని, దానిపైనే దర్యాప్తు సాగుతోందని ఓ అధికారి చెప్పారు. ఈ తనిఖీలు కేవలం ‘సర్వే’ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
 
బుధవారం ముంబైలోని జుహులో ఉన్న సోనూ స్వచ్ఛంద సంస్థతో పాటు ఆరు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. 20 గంటల పాటు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, ప్రతిపక్షాలు ఈ దాడులపై మండిపడుతున్నాయి. 
 
కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూకు గుర్తింపు రావడం వల్లే ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం సోనూను అంబాసిడర్‌గా నియమించుకుంది. అందుకే బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి ఈ సోదాలు చేయిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనార్టీలకు సబ్ ప్లాన్‌ ఏర్పాటుకు ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర