ఖైదీ కుమ్మేస్తున్నాడు.. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం..

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (18:16 IST)
ఆవారా, ఊపిరి ఫేమ్ కార్తీ తాజాగా నటించిన ఖైదీ సినిమా.. తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 25వ తేదీన విడుదలైంది. అయితే కార్తీ వరుస పరాజయాలతో వున్న కారణంగా ఈ సినిమాను అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఖైదీ వసూళ్ల పరంగా అదరగొడుతోంది. కథానాయికగానీ, పాటలుగాని ఉండవనే సరికే పట్టించుకోవడం మానేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 30 లక్షల షేర్‌ను మాత్రమే రాబట్టింది.
 
తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పుంజుకున్నాయి. మరుసటి రోజున ఈ సినిమా రూ.90 లక్షల షేర్‌ను వసూలు చేసింది. ఇక మూడవ రోజున 1.30 కోట్ల షేర్‌ను సాధించింది. ఇలా 'ఖైదీ' వసూళ్లు రోజు రోజుకీ పెరుగుతూ వెళుతున్నాయి. తమిళంలోనే కాదు.. తెలుగులోను ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
 
కార్తీ నటించిన తాజా చిత్రం ‘ఖైదీ’ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ప్రస్తుతం పెద్దగా తెలుగు సినిమాలు లేకపోవడంతో ఖైదీ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా సేఫ్‌ జోన్‌కు చేరుకుందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. డ్రగ్స్ మాఫియా, పోలీసుల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఖైదీకి తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments