Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితిక గిచ్చితే రచ్చ చేశావు... మరి పునర్నవి కొరికితే సైలెంట్‌గా ఉన్నావా..?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (15:26 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో క్లైమాక్స్‌కు చేరింది. ఇక ఈ వారం హౌస్ నుంచి శివజ్యోతి ఎలిమినేట్ అయింది. మిగిలిన ఐదుగురు సభ్యులు అలీ, రాహుల్, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి ఫినాలేకు వెళ్లారు. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వచ్చిన ఆదివారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌లో జరిగిన ఓ సీక్రెట్‌ను తనతో పంచుకోవాలని చెప్పాడు. అలా ఒక్కొక్కరు హౌస్ సీక్రెట్‌లను అతడితో చెప్పారు. ఇక విజయ్‌ని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఓ రొమాంటిక్ సీక్రెట్‌ను విజయ్‌తో పంచుకున్నాడు. అది పునర్నవి భూపాలం గురించి కావడంతో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది.
 
కాకరకాయ జూస్‌ టాస్క్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను పునర్నవి ముద్దుపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం హౌస్‌మేట్స్‌తో పాటు అందరికీ తెలుసు. దీనికి మించిన మరో విషయాన్ని విజయ్‌తో చెప్పాడు రాహుల్. ఓ టాస్క్‌లో పునర్నవి భూపాలం కోపంతో తన చేతిని కొరికి పారిపోయిందని  సీక్రెట్ బయటపెట్టాడు. ఇది హౌస్‌లో ఎవరికీ తెలియదని తెలిపాడు రాహుల్. దీనిపై హోస్ట్ నాగార్జున సెటైర్ వేశారు. వితిక గిచ్చితే రచ్చ చేశావని.. మరి పునర్నవి కొరికితే సైలెంట్‌గా ఉన్నావా.. అంటూ ప్రశ్నించాడు. దానికి రాహుల్ నవ్వుతూ ఉండిపోయాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments