సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదు..

Webdunia
ఆదివారం, 15 మే 2022 (19:51 IST)
సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణి బాధితుల్లో తాము కూడా ఒకరమని.. ఓ ఇంటి కొనుగోలు విషయంలో తమ నుంచి రూ.3.5లక్షలు వసూలు చేసి తమతో ఒప్పందం చేసుకున్నట్లు బాధితుడు గోపికృష్ణ ట్విట్టర్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. కరాటే కళ్యాణి పురుగులు మందు తాగిన వీడియో పంపి భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పాడు. 
 
ఇంకా ఆమె విషయంలో వెంటనే స్పందించిన ఎస్‌హెచ్ఓకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కరాటే కళ్యాణి బాధితుల్లో ఒకరైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఫిర్యాదులో బాధితుడు తెలియజేశాడు. 
 
ఇకపోతే.. ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ యూసుఫ్ గూడ బస్తీలో ఇటీవలే నటి కరాటే కళ్యాణి అండ్ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
కరాటే కళ్యాణి యు ట్యూబర్ శ్రీకాంత్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి.. కరాటే కళ్యాణిపై చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ సీఎంపై పోక్సో కేసు : వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశం

President Murmu: తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

ఇకపై సర్వం ఆధార్ మయం - రెస్టారెంట్లలో ఎంట్రీకి తప్పనిసరి

రహస్యంగా ఇద్దరితో పెళ్లి ... తిక్క కుదిర్చిన జైలుపాలు చేసిన భార్యలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments