కేజీఎఫ్ చాప్టర్ 3పై వచ్చే వార్తలన్నీ అవాస్తవాలే..

Webdunia
ఆదివారం, 15 మే 2022 (16:14 IST)
కన్నడ రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "కేజీఎఫ్-2". ఈ చిత్రం గత నెలలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది. ఇది 'కేజీఎఫ్‌'కు సీక్వెల్‌గా వచ్చింది. 
 
ఇపుడు 'కేజీఎఫ్-2'కు సీక్వెల్‌గా 'కేజీఎఫ్-3' రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. "కేజీఎఫ్-3"కి సంబంధించి కథా నిర్మాణం జరుగుతుందని, ఈ యేడాది నవంబరు నుంచి సినిమా సెట్స్‌పైకి వెళుతుందని నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పినట్టు ఓ వార్తల హల్చల్ చేసింది. పైగా, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ నేపథ్యంలో "కేజీఎఫ్" నిర్మాణ సంస్థకు హోంబలేకు చెందిన మరో నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. అవన్నీ వట్టి వార్తలేనంటూ కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ చేతిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయని, వాటిపైనే దృష్టిపెట్టామని తెలిపారు. అందువల్ల ఇప్పట్లో "కేజీఎఫ్-3"ను పట్టాలెక్కించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments