Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్విట్టర్ నుంచి ఇద్దరు టాప్ ఉద్యోగులు ఔట్...

ట్విట్టర్ నుంచి ఇద్దరు టాప్ ఉద్యోగులు ఔట్...
, శుక్రవారం, 13 మే 2022 (14:30 IST)
ప్రముఖ సామాజిక మాద్యమం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీంతో ఆ సంస్థలోని ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ఈ తరహా ఆందోళనను బహిరంగంగా కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ నుంచి ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అదేసమయంలో సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తప్పించి, ఎలాన్ మస్క్‌ సీవీవోగా కొనసాగుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ట్విట్టర్ నుంచి ఇద్దరు టాప్ ఉద్యోగులు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రీసెర్స్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్ విభాగం లీడ్ చేస్తున్న జనరల్ మేనేజర్ కేవ్వాన్ బేక్పూర్, ప్రొడక్ట్స్ విభాగం అధిపతి బ్రూస్ ఫాల్క్‌లు తమతమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, ఈవార్తలకు కేవ్యాన్ వివరణ ఇచ్చారు. తాను రాజీనామా చేయలేదని, కానీ ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించారని చెప్పారు. తనను రాజీనామా చేయాలని పరాగ్ అగర్వాల్ చెప్పారని వెల్లడించారు. 
 
అలాగే, ఈ వారం నుంచి కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. పనికి అవసరమైన అత్యంత ముఖ్యమైన నియామకాలు మినహా ఇతర నియామకాలు చేపట్టబోమని స్పష్టం చేసింది. సంస్థకు మస్క్ చేపట్టిన తర్వాత పరాగ్ అగర్వాల్‌తో సహా మరికొందరు సీనియర్ అధికారు వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకవైపు కూరగాయలు.. చికెన్, మటన్.. మరోవైపు.. సిలిండర్, పెట్రోల్ ధరలు పైపైకి..!