Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొనాల్డ్‌పై ట్విట్టర్ శాశ్వత నిషేధం తప్పే.. జాక్ డోర్సీ

Advertiesment
donald trump
, బుధవారం, 11 మే 2022 (12:30 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌పై ట్విట్టర్ శాశ్వత నిషేధం తప్పేనని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాశ్వత నిషేధాలు కంపెనీ వైఫల్యానికి నిదర్శనమని, అవెప్పుడూ పనిచేయవని అన్నారు. 
 
చట్టవిరుద్ధమైన ప్రవర్తన, స్పామ్, లేదంటే నెట్‌వర్క్ మానిప్యులేషన్ వంటి వాటితో ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే శాశ్వత నిషేధం విధించాలని డోర్సీ చెప్పుకొచ్చారు.
 
ట్విట్టర్ తన నిర్ణయాన్ని ఎప్పుడూ పునఃసమీక్షించుకుంటూ ఉండాలని, అవసరమైన విధంగా అభివృద్ధి చెందుతూ ఉండాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధం విధించి ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఇకపోతే.. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు తెలిపారు.  
 
ఇకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌, తన మద్దతుదారులను ట్విట్టర్ ద్వారా యుఎస్ పార్లమెంటును ఘెరావ్ చేయాలని కోరారు. ఆయన మద్దతుదారులు పార్లమెంటులో హింసకు పాల్పడ్డారు. 
 
అదే సమయంలో, హింసను ఖండించడానికి బదులుగా.. ట్రంప్ మద్దతుదారులను విప్లవకారులుగా పిలిచారు. ఆ సమయంలో హింసను ప్రేరేపించే అవకాశం ఉన్నందున ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను నిషేధించారు.
 
అయితే ఎలన్‌ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేస్తున్నట్ట ప్రకటన వెలువడగానే ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి తిరిగి రావడానికి దారితీస్తుందా అనే చర్చలు కూడా అప్పుడే మొదలయ్యాయి. 
 
వారి అంచనాలు ఇప్పుడు నిజమయ్యాయి. అయితే ట్రంప్ మాత్రం తాను ట్విట్టర్‌కి తిరిగి వెళ్లననీ, గత కొన్ని వారాల్లో ట్రూత్ సోషల్‌లో యాక్టివ్‌గా ఉంటాననీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి గడపగడపకు వైస్సార్సీపీ