Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్ద‌రూ వాడుకుని వ‌దిలేశారు - కరాటే కళ్యాణి

Advertiesment
Karate Kalyani
Karate Kalyani
కరాటే కళ్యాణి అంటే  ఫైర్ బ్రాండ్‌. ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడే ఈమె రంగ‌స్థ‌ల న‌టి కూడా. బుర్ర‌క‌థ‌లు చెప్ప‌డంలో విశేష అనుభ‌వం వుంది. మంచి డాన్స‌ర్ కూడా. సినిమాల్లో అవ‌కాశాలు లేన‌ప్పుడు క‌ల్చ‌ర‌ల్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటుంది. ఇటీవ‌లే ఓ య్యూట్యూబ్ ఇంట‌ర్యూలో త‌న జీవిత స‌హ‌చ‌రులు గురించి చెప్పింది. ఇప్ప‌టికి త‌న‌కు రెండు పెండ్లిళ్లు అయ్యాయి. అయినా అర్థం చేసుకుని విడిపోయాం. ఇప్పుడు మూడో పెల్లికి రెడీ. కానీ న‌న్ను అర్థం చేసుకునేవాడు కావాలి. ఇద్ద‌రు న‌న్ను వాడుకుని వదిలేశారు. అంటూ క్లారిటీగా చెప్పింది. గ‌తంలో సింగ‌రేణి కాల‌నీలో మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేసిన కేసులో ఆమె ఆ కుటుంబానికి అండ‌గా నిలిచింది. అది నెట్టింట్లో పెట్డ‌డంతో వైర‌ల్ అయింది. అప్పుడు ఆమెను త‌ప్ప‌ని స్థితిలో అరెస్ట్ చేశారు.
 
ఇప్పుడు నేను సింగిల్‌గానే వుంటున్నా. ఇంత‌వ‌ర‌కు నిజ‌మైన ప్రేమ దొర‌క‌లేదు. పెండ్లికి ముందు ప్రేమ అంటూ తిరిగారు. కొద్దిరోజులు కాపురం చేశాక వెళ్ళిపోయారు. ఇది అస‌లైన ప్రేమ‌కాదు. నాకు సినిమాల్లో ప్రేమ వ‌ద్దు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ కావాలి అంటూ చెప్పింది. ఇప్పుడు పిల్లు పెద్ద‌వారు అవుతున్నారు. అందుకే అంద‌రికీ ఆమోద‌మోగ్య‌మైన భ‌ర్త కోసం ఎదురుచూస్తున్నా. జీవితంలో వైవాహిక జీవితంలో సారాంశం పూర్తిగా అనుభ‌వించ‌లేద‌ని తేల్చిచెబుతోంది. పైగా.. భార్య అంటే వంటింటికి మాత్రమే పనికొచ్చేది కాదు. నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు. నేను నిప్పు.. నిప్పును ఎవరైనా ఎంతసేపు పట్టుకోగలరు. అందుకే నా వివాహ జీవితం మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళు వదిలి వెళ్లడంలో నా తప్పు లేదు. అంటూ ద‌న‌దైన శైలిలో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతు మంచివాడే కానీ.. అంటూ క్లారిటీ ఇచ్చిన స‌మంత‌