నాగచైతన్య, సమంత వివాహం, పెటాకుల విషయం ఇంకా హాట్ టాపిక్‌గా మారుతూనే వుంది. ఇద్దరం అర్థం చేసుకునే విడిపోయామని క్లారిటీగా చెబుతున్నారు. కానీ మీడియా వారిని వదలడంలేదు. తాజాగా నిన్న ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరలా వీరి ప్రస్తావన వచ్చింది. దీనితో సమంత ఏదో ఒకరోజు మరలా మా జంట గురించి మాట్లాడాల్సివస్తుందంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది.
విడాకులు తీసుకున్నాక మేమిద్దం హ్యాపీగా వున్నామంటూ తెలిపారు. అందుకు నిదర్శనంగా స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ టూర్‌లు వెళుతుంది సమంత. ఇక మీ భర్త చైతు ఎలాంటివాడు అన్న ప్రశ్నకు ఆమె మామూలుగానే సమాధానం ఇచ్చింది. చైతు చాలా మంచివాడు. ఆదర్శపురుషుడు అన్న లెవల్లో సమాధాన ఇచ్చింది. ఓ సందర్భంలో నేను, చైతన్యతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నాం. నా దగ్గర డబ్బులు లేవు. నా ఫోన్ కూడా పనిచేయడంలేదు. అప్పుడు చైతు వచ్చి తన ఫోన్ ఇచ్చి మాట్లాడమని చెప్పాడు. చైతన్య పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్. ఆర్థికంగా చాలా ఆదుకున్నాడంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ఇంత బాగున్న మీరు ఎలా విడిపోయరనే ప్రశ్నకు దాటవేస్తూ వెంటనే వేరే టాపిక్‌లోకి వెళ్ళిపోయింది.
పబ్లిక్‌లో ఇలా భర్త గురించి చెప్పడం ఎవరికైనా సహజమే. ఫోన్ ఇవ్వడం. అదే పెద్ద సాయం అన్నట్లు సమంత మాట్లాడడం. ఏదో మసిపూసి మారేడుకాయ చేసిందని తెలుస్తోంది. అందుకే ఎన్నిసార్లు మీడియా అడిగినా ఆమె నుంచి సమాధాన రాబట్టడం కష్టమంటూ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.