Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌మంతలా ఐటం సాంగ్‌కు రెడీ - రాజేంద్ర‌ప్ర‌సాద్ గురించి సెన్సేష‌న‌ల్ కామెంట్ - మాళవిక

Advertiesment
స‌మంతలా ఐటం సాంగ్‌కు రెడీ - రాజేంద్ర‌ప్ర‌సాద్ గురించి సెన్సేష‌న‌ల్ కామెంట్  - మాళవిక
, మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (07:45 IST)
Samantrha-Malavika
దక్షిణ భారత చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించిన మాళవిక మ‌ర‌లా తెర‌పైకి వ‌చ్చేందుకు రెడీ అంటోంది. తెలుగులో  శ్రీకాంత్ హీరోగా నటించిన చాలాబాగుంది చిత్రం ద్వారా ప్రవేశించింది. ఆ త‌ర్వాత చేసింది ఐదు సినిమాలే అయినా త‌మిళంలో 35, హిందీలో 5 సినిమాల్లో న‌టించింది. తాజాగా అలీతో స‌ర‌దాగా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగులో మ‌ర‌లా ఛాన్స్ వ‌స్తే అమ్మ పాత్ర‌లు చేయ‌ను. ఇంకా వ‌య‌స్సు రాలేదు. హీరోయిన్‌గా ఇవ్వ‌రు అంటూ.. ఇటీవ‌లే `పుష్ప‌` సినిమా చూశాను. అందులో స‌మంత `ఊ.. అంట‌ావా..` సాంగ్ నాకు బాగా న‌చ్చింది. అలాంటి పాత్ర వ‌స్తే ఎగిరిగంతేస్తానంటూ.. పాట‌కు త‌గిన‌ట్లుగా డాన్స్ మూవ్‌మెంట్ ఇస్తూ చెప్పింది.

 
అంటే, పుష్ప‌-2లో ఒక‌వేళ సాంగ్ వుంటే చేస్తాన‌ని చెప్పింది. అల్లు అర్జున్ ఇది గ్ర‌హించాలంటూ యాంక‌ర్ స‌ర‌దాగా కామెంట్ చేశారు. ఇక ప‌లువురి హీరోల‌తో న‌టించిన మాళ‌విక‌.. అజిత్‌, ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ ఇలా అంద‌రికి గురించి బాగా చెబుతూ, ఒక్క రాజేంద్ర‌ప్ర‌సాద్ విష‌యం వ‌చ్చేస‌రికి చెప్ప‌నంటే చెప్ప‌ను అంటూ క్లారిటీ ఇచ్చింది.


ఆయ‌న‌తో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమాలో న‌టించింది. ఎందుక‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ గురించి చెప్ప‌రు అంటే, వ‌ద్దండి. ఆయ‌న గురించి చెబితే, పెట్టే బేడా స‌ర్దుకుని బొంబే వెళ్ళిపోవాలి. తెలుగు ప‌రిశ్ర‌మ‌ను మ‌ర్చిపోవాలి.. అంటూ క్లారిటీ ఇచ్చింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో అప్ప‌ట్లోనే చేదు అనుభ‌వం ఎదురైంద‌ని చెప్పింది. మ‌రి దీనికి రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి?