Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

సెల్వి
గురువారం, 12 జూన్ 2025 (14:12 IST)
కన్నడ సినిమాల్లో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి గొప్ప రికార్డు సృష్టించిన సినిమా కాంతారా. ప్రస్తుతం సీక్వెల్ 'కాంతారా 2' సిద్ధం అవుతోంది. కేరళలోని త్రిసూర్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ విజు వికె బుధవారం (జూన్ 11) అర్ధరాత్రి గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. 
 
ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతార 2 సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూయడం శాండల్ వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త్రిసూర్‌లో నివాసముండే విజు వికే కాంతార: చాప్టర్-1 సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. అగుంబే సమీపంలోని హోమ్ స్టేలో ఆయన బస చేశారు. 
 
అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కాంతార: చాప్టర్ 1 అనేది కాంతార చిత్రానికి ప్రీక్వెల్. 2022లో విడుదలైన కాంతార పాన్-ఇండియా స్థాయిలో హిట్ అయింది.

ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ సంస్థనే ఈ ప్రీక్వెల్‌ను కూడా రూపొందిస్తోంది. అయితే ఈ ఆర్టిస్టు మరణాలపై కాంతార టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments