Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

Advertiesment
lawyer died with heart attack

ఐవీఆర్

, మంగళవారం, 10 జూన్ 2025 (18:21 IST)
అదేమిటో కానీ కరోనా వైరస్ (corona virus) విజృంభణ తర్వాత దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకమూల గుండెపోటు (heart attack) తో హఠాత్తుగా మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతూ కనబడుతోంది. వయసుతో సంబంధం లేకుండా పెద్దలైనా, పిల్లలైనా ఇలా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇంతకుమునుపు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు, గుండె సమస్యలు లేనివారు కూడా పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆకస్మిక గుండెపోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి సరోజినీ నగర్ తహసీల్ కార్యాలయంలో 25 ఏళ్ల న్యాయవాది అభిషేక్ కేవాల్ అలియాస్ పవన్ సింగ్ ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. అభిషేక్ సింగ్ తన తోటి న్యాయవాదులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఒక గేటు వైపు వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు.
 
ఎవరికీ ఏమీ అర్థం కాకముందే అతను మరణించాడు. ఈ సంఘటన మొత్తం సమీపంలో ఏర్పాటు చేసిన CCTVలో రికార్డైంది, దీని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్ సింగ్ బంత్రాలోని కాన్పూర్ రోడ్‌లోని హనుమాన్ ఆలయం సమీపంలో వుంటున్నారు. లక్నో తహసీల్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ప్రతిరోజులాగే అభిషేక్ సోమవారం కూడా తహసీల్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత తన తోటి న్యాయవాదులతో కలిసి తహసీల్ ప్రాంగణం నుండి బయలుదేరాడు.
 
ఇంతలో అతనికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే పడిపోయాడు. తోటి న్యాయవాదులు ఏదోవిధంగా అతన్ని పైకి లేపి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించిన సిసిటివి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అభిషేక్ తన సహోద్యోగులతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అతను పూర్తిగా సాధారణంగా కనిపిస్తున్నాడు. ఇంతలో, అతని సహోద్యోగులలో ఒకరు గేటు దగ్గర ఆగారు, ఆ తర్వాత అభిషేక్ కూడా అతని వైపు వెళ్ళడం ప్రారంభించాడు.
 
అలా వెళుతుండగానే అకస్మాత్తుగా అతని అడుగులు తడబడ్డాయి, ఎవరికీ ఏమీ అర్థం కాకముందే అతను మూర్ఛపోయి నేలపై పడిపోయాడు, ఆ తర్వాత తోటి న్యాయవాదులు అతని వద్దకు పరుగులు తీసారు. తోటి న్యాయవాదులు అతడిని పైకి లేపినప్పుడు అతని శరీరంలో ఎటువంటి కదలిక లేదు. ఆసుపత్రికి చేరుకునేలోపే అతను మరణించాడు. అభిషేక్ మరణం అతని కుటుంబానికి దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. అతనికి ఎటువంటి అనారోగ్య సంబంధ వైద్య చరిత్ర లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో హైలాండ్ నూతన కార్యాలయ ప్రారంభం