Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే నుంచి సిమ్లాకు బదిలీ చేయండి.. : సుప్రీంలో కంగనా పిటిషన్

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (16:54 IST)
బాంబేలో తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల విచారణను హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని సిమ్లాకు బదిలీ చేయాలని కోరుతూ బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. 
 
బాంబేలో కేసుల విచారణకు హాజరుకావడం తన ప్రాణానికి ముప్పు అని, శివసేన నేతల నుంచి తనకు ప్రాణ హానీ ఉందని కంగన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అందువల్ల బాంబే కోర్టుల్లో తనపై ఉన్న మూడు కేసులను తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేయాని న్యాయస్థానాన్ని కోరారు. నటి తరపున న్యాయవాది నీరజ్‌ శేఖర్‌ ఈ పిటషన్‌ దాఖలు చేశారు. 
 
సోషల్‌మీడియాలో మతపరమైన విమర్శలు చేసినందుకుగానూ కంగన, ఆమె సోదరిపై రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 
 
వీటితో పాటు నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రముఖ రచయిత‌ జావెద్‌ అక్తర్‌ ఆమెపై పరువునష్టం దావా వేశారు.
 
ఈ కేసులను కొట్టివేయాలంటూ గతంతో కంగన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూలమైన తీర్పు రాకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments