Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న్మ‌థుడు హాంగోవ‌ర్‌లో వున్న శ్రీ‌ముఖి, అది తీరుస్తా రమ్మంటూ హగ్

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (16:32 IST)
Srimukhi, Nag
గ్లామ‌ర్ యాంక‌ర్‌ శ్రీ‌ముఖి ఏది చేసినా వెరైటీగా వుంటుంది. త‌ను చేసే యాంక‌ర్‌లోనూ ప్రోగ్రామ్‌లోనూ ఆహుతుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తుంది. అందులో మ‌న్మ‌థుడుగా సినిమాలో పేరు పొందిన‌ నాగార్జునను చూస్తే ఎవ‌రికైనా ఆయ‌న‌తో న‌టించాల‌ని వుంటుంది.

ఇంత‌కుముందు అన‌సూయ అలాంటి కోరిక‌ను వ్య‌క్తం చేసి సోగ్గాడే చిన్నినాయ‌న‌లో త‌న న‌ట‌నా కోరిక‌ను తీర్చుకుంది. ఇక శ్రీ‌ముఖి గురించి చెప్ప‌క్క‌ర్లేదు. త‌న టాలెంట్‌తో బిగ్‌బాస్‌ 4వ సీజ‌న్‌లో పాల్గొంది. నాగార్జున హోస్ట్‌గా వున్న ఆ స‌మ‌యంలో ఆయ‌నంటే త‌న‌కెంతో అభిమాన‌మ‌ని పేర్కొంది. ఇప్పుడు వైల్డ్‌డాగ్ ప్రోగ్రామ్‌కు శ్రీ‌ముఖి యాంక‌ర్‌గా హాజ‌రైంది.

నాగార్జున రాగానే చెప్ప‌లేని ఆనందంతో మిమ్మ‌ల్ని చూస్తుంటే ఇంకా మ‌న్మ‌థుడు2 హాంగోవ‌ర్‌లో వున్నామంటూ నాగ్ చేతులు ప‌ట్టుకుని ఆహ్వ‌నం ప‌లికింది. దానికి వెంట‌నే నాగ్ ఆ హాంగోవ‌ర్‌కు మెడిసిన్‌ ఇస్తానంటూ స‌ర‌దాగా శ్రీ‌ముఖిని హ‌గ్ చేసుకున్నాడు. ఇది ద‌గ్గ‌ర‌గా చూసిన వారు స‌ర‌దాగా ముసిముసి న‌వ్వులు కురిపించారు.

ఇక ఆ త‌ర్వాత అంద‌రినీ ఆహ్వానిస్తూ, రొటీన్‌గా సినిమా టీమ్‌కు చెందిన వారిని పిలుస్తూ మాట్లాడించింది. నాగార్జున పేరు వ‌చ్చేస‌రికి.. మ‌ర‌లా అదే రిపీట్ చేస్తూ.. మేమంతా మ‌న్మ‌థుడు2 హాంగోవ‌ర్‌లోనే వున్నామంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తించింది. వెంట‌నే నాగ్‌.. బిగ్‌బాస్ సీజ‌న్లో నిన్నేమ‌న్నా అన్నానా! అంటూ సెటైర్ వేశాడు.. ఇలా స‌ర‌దాగా సాగిన కార్య్ర‌క్ర‌మం ద్వారా నాగ్‌తో న‌టించే పాత్ర కోసం క‌ర్చీఫ్ వేసింద‌నే వార్త వినిపిస్తోంది. త్వ‌ర‌లో నాగ్‌తో శ్రీ‌ముఖి న‌టించే అవ‌కాశం లేక‌పోలేద‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments