Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ మహాపురుషుడు - బీజేపీ కోరితే రాజకీయాల్లోకి : కంగనా రనౌత్

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:51 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మనస్సులో మాటను బహిర్గతం చేశారు. భారతీయ జనతా పార్టీ టిక్కెట్ ఇస్తే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. పైగా, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని ఉందంటూ తన మనస్సులోని మాటను వెల్లడించారు. పనిలోపనిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను మహాపురుషుడిగా సంబోధించారు. 
 
తాజాగా ఆమె ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవకాశం వస్తే హిమాచల్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, బీజేపీ టిక్కెట్ ఇస్తేనే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తానని ప్రకటించారు. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ జాతీయభావం కనిపిస్తుందన్నారు. తాను కాంగ్రెస్ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మోడీ పనితీరుతో ఇపుడు తమ కుటుంబం బీజేపీ వైపు నిలిచిందన్నారు.
 
తాను కనుక సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని హిమాచల్ ప్రదేశ్, మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు బీజేపీ కనుక కోరుకుంటే మండీ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అదేసమయంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీదారు కానేకాదు అని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments