Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోకాళ్లు, కీళ్లనొప్పులు.. రోడ్డుపై వున్న ఈ దేవతను మొక్కితే?

God
, శనివారం, 8 అక్టోబరు 2022 (22:34 IST)
God
మోకాళ్లు, కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా.. అయితే ఆస్పత్రికి వెళ్లక్కర్లేదు.. రోడ్డుపై వున్న ఈ దేవతను మొక్కితే చాలు అంటున్నారు.. కన్నడ ప్రజలు. ఇదేంటి వింతగా వుందే అనుకునేరు. అయితే ఇది నిజం. అసలు విషయానికి వెళ్తే.. మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తే ఆస్పత్రికి వెళ్లడమో.. మందులు వాడటమో చేస్తుంటాం. 
 
కానీ కర్ణాటక చామరాజనగర్ ప్రజలు మాత్రం​ జాతీయ రహదారిపై ఉన్న రాయి దగ్గరకు వెళుతున్నారు. ఆ రాయికి మొక్కితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయట. యలందూర్​ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఓ రాయి చాలా ఏళ్లుగా ఉంది. 
 
మోకాళ్ల, నడుము, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని విశ్వాసం. ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, కూలీలు సైతం ఇక్కడకు దిగి మొక్కుతున్నారు. అక్కడ నారికల్లు మారమ్మ అనే దేవత ఉందని స్థానికులు నమ్ముతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొరక్కదొరక్క దొరికిన పులస.. రూ.22వేలతో రికార్డ్