Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొరక్కదొరక్క దొరికిన పులస.. రూ.22వేలతో రికార్డ్

Advertiesment
Pulasa
, శనివారం, 8 అక్టోబరు 2022 (22:09 IST)
Pulasa
గోదావరి జిల్లాలో పులస చేపలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పులస చేప కోసం వేలంలో పోటీపడిమరీ వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తారు. దీంతో, పులస ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా పులస రికార్డులు బద్దలుకొట్టింది. 
 
తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఫిష్ మార్కెట్‌లో మూడు కేజీల పులస చేప ఏకంగా 22వేల రూపాయలు పలికింది. ఈ సీజన్‌లో దొరికిన మొదటి పులస కావడంతో దాన్ని దక్కించుకోవడానికి ఎగబడ్డారు పులస ప్రియులు.
 
చివరకు రాజోలుకు చెందిన బైడిశెట్టి శ్రీరాములు ఈ పులసను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో దొరక్కదొరక్క దొరికిన పులస 22వేల రూపాయలు పలికింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు: రోడ్లపై నీరు.. ట్రాఫిక్ జామ్