Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ20 వరల్డ్ కప్‌కు జడేజా దూరం - ఇప్పుడే చెప్పలేమంటున్న కోచ్ ద్రవిడ్

ravindra jadeja
, ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (16:26 IST)
టీ20 ప్రపంచ కప్‌కు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఆయన కుడి మోచేతికి గాయం తగిలింది. దీంతో ఆయన ఈ పొట్టి ప్రపంచ కప్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఇపుడే చెప్పలేమని అంటున్నారు. 
 
ప్రస్తుతం దుబాయ్ వేదికగా ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఇందులో తొలి రెండు మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా పాల్గొన్నారు. కానీ, మోకాలు గాయానికి గురై పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు ముందు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో ఆయన స్వదేశానికి చేరుకున్నాడు. అతని మోకాలికి తీవ్ర గాయమైనట్టు తేలింది. దీనికి ఆపరేషన్ చికిత్స అవసరం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జడ్డూ కొన్ని నెలలు పాటు జట్టు దూరంకానున్నాడు. 
 
దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, "జడేజా మోకాలుకు తీవ్రమైన గాయం అయింది. దీనికి మేజర్ సర్జరీ అవసరం. కాబట్టి కొంతకాలం అతను ఆటకు దూరంగా  ఉంటాడు. జడేజాను పరీక్షించిన ఎన్.సి.ఏ వైద్య బృందం అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎపుడు తిరిగి వస్తాడో అంచనా వేయలేకపోతుంది" అని చెప్పాడు. అయితే, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం మరోలా స్పందించారు. జడేజా విషయంలో ఇపుడే ఏం చెప్పలేమని ఒక్క ముక్కలో తేల్చిపారేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ అభిమానులకు శుభవార్త - 2023లో కెప్టెన్‌గా బరిలోకి...