Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బాహుబలి''కి మించిన సినిమా తీస్తా.. చూద్దురుగానీ.. కంగనా రనౌత్

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (12:13 IST)
దక్షిణాది సినిమాలు బాలీవుడ్ సినిమాల స్థాయిలో వసూళ్లు సాధించడం కష్టం. అయితే బాహుబలి సినిమాతో జక్కన్న బాలీవుడ్‌నే కాదు.. ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసింది. బాహుబలి ది బిగినింగ్ బాలీవుడ్ వర్గాల దృష్టిని ఆకర్షించగా - బాహుబలి 2 చిత్రం బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది. బాలీవుడ్ బాద్ షాలకే సాధ్యం కాని వసూళ్ల వర్షం కురిపించింది. ఎన్నో అవార్డులు, రికార్డులు సాధించింది. 
 
ఈ నేపథ్యంలో బాహుబలికి మించిన సినిమా తీసేందుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ సిద్ధమంటోంది. ఎప్పుడూ వివాదాలతో స్నేహం చేస్తున్నా వరుస సినిమాలతో కంగనా దూసుకెళ్తోంది. ఇటీవల కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మణికర్ణిక' సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. చారిత్రాత్మక సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. కంగనాకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. తాజాగా మరో చారిత్రాత్మక సినిమాకు దర్శకత్వం వహించే పనుల్లో కంగనా రనౌత్ తలమునకలైంది. 
 
తాను ప్రధాన పాత్రధారిగా నటించే ఈ సినిమాకి తానే దర్శకత్వం వహించనున్నట్టు చెప్పింది. బడ్జెట్ పరంగా, తారాగణం పరంగా, గ్రాఫిక్స్ పరంగా ఈ చిత్రం బాహుబలి, పద్మావత్ సినిమాలకు మించి వుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు పూర్తికాగానే స్వీయ దర్శకత్వంలో చిత్రం చేస్తానని కంగనా రనౌత్ చెప్పింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments