Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తి రేపుతోన్న 'అభినేత్రి 2' ఫస్టులుక్

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:57 IST)
ప్రభుదేవా, తమన్నా జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో 2016వ సంవత్సరంలో 'అభినేత్రి' చిత్రం తెరకెక్కింది. తమిళ, హిందీ భాషలతో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్‌గా 'అభినేత్రి 2' సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.
 
ప్రధాన పాత్రధారులైన ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతలపై ఆవిష్కరించిన ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. 'అభినేత్రి'లో తమన్నా పల్లెటూరి అమ్మాయిగానూ.. మోడ్రన్ అమ్మాయిగానూ డిఫరెంట్ లుక్స్‌తో కనిపించి మెప్పించేసిన విషయం తెలిసిందే. 
 
'అభినేత్రి 2' మాత్రం ప్రభుదేవా డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నట్టు చెప్తున్నారు. ఇక నందితా శ్వేత పాత్ర ప్రధాన ఆకర్షణ అవుతుందనే చెప్పాలి. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సీక్వెల్‌తోనూ హిట్ కొడతాడనే టాక్ కోలీవుడ్‌లో బలంగానే వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Birthday: బర్త్ డే జరుపుకుందామనుకుంటే.. కేకు పేలింది.. (video)

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

Hall Tickets: హాల్ టిక్కెట్లు లేకపోయినా పరీక్షలు రాయడానికి అనుమతి.. ఎక్కడంటే?

అది మా పనోళ్ల కోసం నిర్మించిన సెక్యూర్డ్ భవనం : మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Video)

ప్రయాగ్ రాజ్ మోనాలిసా ఇంటికి దర్శకుడు సనోజ్ మిశ్రా, సినీ ఆఫర్ కన్ఫర్మ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments