Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రావణుడి కన్ను రంభపై పడింది... అప్పుడేం జరిగింది?

Advertiesment
రావణుడి కన్ను రంభపై పడింది... అప్పుడేం జరిగింది?
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (22:00 IST)
అప్సరసల గురించి అందరూ వినే ఉంటారు. ఇప్పటికీ అందంగా ఉన్న వారిని అప్సరసలతో పోల్చుతారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలా కొందర్ని కలిపి అప్సరసలు అంటారు. అసలు వీరి పుట్టుకనే విచిత్రంగా ఉంటుంది. బ్రహ్మ పిరుదుల్లో నుంచి కొందరు రాక్షసులు పుట్టారు. వారంతా బ్రహ్మ వెంట పడ్డారట. అయితే బ్రహ్మ తన శరీరాన్ని వదిలిపెట్టి వాసన చూసుకోవడంతో అప్సరసలు పుట్టారని ఒక కథ ఉంది.
 
అలాగే క్షీర సముద్రంను చిలికే సందర్భంలోనూ అప్సరసలు పుట్టారని ఒక కథనం ఉంది. వీరంతా ఇంద్రలోకంలో ఆడిపాడుతూ ఆనందాన్ని పంచేవారు. ఇక అప్సరసల్లో అందరూ అందగత్తెలే. అందులో రంభ మరింత అందగత్తె. అయితే ఇంద్రుడు అప్సరసలను అన్ని రకాలుగా వాడుకునేవాడు. ఎవరైనా తపస్సు చేసి తన కన్నా ఎక్కువ శక్తులు పొందుతారని ఇంద్రుడు భావిస్తే వెంటనే అక్కడికి అప్సరసలను పంపేవాడు.
 
అప్సరసల ద్వారా తపస్సులను భగ్నం చేసేవాడు. ఇక రంభను ఇంద్రుడు అన్ని రకాలుగా బాగానే వాడుకున్నాడు. రంభకు నల కుబేరుడు అంటే బాగా ఇష్టం. అతనితో సుఖం పొందాలని రంభ పరితపించేది. ఒకసారి రంభ నల కుబేరుడి అంతఃపురానికి బయల్దేరుతుంది. అప్పుడ రావణాసురుడు రంభను చూస్తాడు. రావణుడికి కూడా రంభపై ఎప్పటి నుంచో కన్ను ఉంటుంది.
 
ఒక్కసారైనా రంభను అనుభవించాలనుకుంటాడు రావణుడు. అందుకే రంభను ఆపుతాడు. తర్వాత ఆమెపై బలవంతంగా అనుభవించాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె తప్పించుకుని వెళ్లి నల కుబేరుడికి విషయం చెబుతుంది. నల కుబేరుడు రావణాసురుడిని శపిస్తాడు. ఇక నుంచి నువ్వు ఏ పర స్త్రీని అయినా బలత్కరిస్తే నీ తల పగిలిపోతుందని శపిస్తాడు. ఆ క్షణంలో రావణుడు రంభ పెద్ద శాపానికి గురికావాని మనస్సులో కోరుకుంటాడు.
 
విశ్వామిత్రుడు ఘోరంగా తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి భయం కలుగుతుంది. ఎలా అయినా సరే ఆ తపస్సుకు భంగం కలిగించాలనుకుంటాడు. వెంటనే రంభను రంగంలోకి దించుతాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు.. వెంటనే విశ్వామిత్రుడి తపస్సుకు భంగం కలిగించాలని రంభను ఆదేశిస్తాడు ఇంద్రుడు. 
 
విశ్వామిత్రుడిని చూడగానే రంభ భయపడింది. ఏం కాదులే మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు వెళ్లు అంటూ రంభను పంపించాడు ఇంద్రుడు. దేవేంద్రుడు, మన్మథుడు అందరూ కలిసి విశ్వామిత్రుడి తపస్సును కాస్త భంగం చేయగలిగారు. తర్వాత తన పరువాలన్నీ చూపిస్తూ విశ్వామిత్రుడి ఎదుట నిలబడి పాటపాడుతూ నిల్చొంది రంభ. 
 
విశ్వామిత్రుడికి కథ మొత్తం అర్థమైపోయింది. రంభ అందాలను చూసి ఆయన ఆశపడలేదు. ఎందుకంటే అంతకుముందే మేనక ద్వారా విశ్వామిత్రుడు దెబ్బతిని ఉంటాడు. అందుకే రంభ అందాలన్నీ చూసి పట్టించుకోడు విశ్వామిత్రుడు. రంభను విశ్వామిత్రుడు గట్టిగా అరిచేసరికి ఆమె భయపడి వణికిపోతుంది. 
 
హేయ్ రంభా... నా తపస్సునే భంగం చేస్తావా నువ్వు..... నువ్వు రాయివై పడి ఉండు అంటూ శపిస్తాడు. పదివేల ఏళ్ల పాటు రంభ అలా శిలలా ఉండాల్సి వచ్చింది. పాపం రంభ అలా తన అందమైన జీవితన్ని రాయిలా మార్చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు ప్రకారం ఇంటి స్థలాలు కొనడం ఎలా..?