Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలు పోర్న్ సైట్లు వంటివి... లైంగిక కంటెంట్‌తో ఆకర్షించలేం... కంగనా రనౌత్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (10:59 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలన పోర్న్ వెబ్‌సైట్లతో పోల్చింది. పైగా లైంగిక కంటెంట్‌తో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టమని జోస్యం చెప్పింది.
 
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడివున్న విషయం తెల్సిందే. అన్‌లాక్ చర్యల్లో భాగంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, కోవిడ్ నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలని ఆంక్షలు విధించింది. 
 
దీంతో అనేక మంది నిర్మాతల తమ చిత్రాలను ఓటీటీ వంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లలో విడుదల చేస్తున్నారు. వీటిపై కంగనా రనౌత్ స్పందించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
డిజిటల్‌ మాధ్యమం ఈరోస్‌ నౌ సంస్థ సల్మాన్‌ఖాన్‌, రణవీర్‌ సింగ్‌, కత్రినాకైఫ్‌లతో ఉన్న మీమ్స్‌ను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత తొలగించేసింది. అయితే ఈ వ్యవహారంపై కంగనా మాత్రం మండిపడింది. 
 
డిలీట్‌ చేసిన మీమ్‌ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కంగనా రనౌత్‌ ఓటీటీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. "సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులను మనం కాపాడుకోవాలి. లైంగిక కంటెంట్‌తో ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టం. డిజిటలైజేషన్‌లో కళ పెద్ద సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ పోర్న్‌ హబ్స్‌ తప్ప మరేమీ కావు" అని అన్నారు కంగనా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం