Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బలాత్కారం చేసిన చంపేస్తాం! కంగనాకు వార్నింగ్... చేసింది ఎవరు?

Advertiesment
బలాత్కారం చేసిన చంపేస్తాం! కంగనాకు వార్నింగ్... చేసింది ఎవరు?
, బుధవారం, 21 అక్టోబరు 2020 (10:44 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్. గత కొన్ని రోజులుగా ఈమెకు టైమ్ బాగోలేనట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు తర్వాత ఆమె చేసిన బంధుప్రీతి వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేశాయి. ఆ క్రమంలోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. అదేసమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైను కంగనా రనౌత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా అభవర్ణించారు. దీంతో ఆమెపై మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండపడ్డారు. వారి నుంచి ప్రాణహాని ఉందని భావించిన కంగనా.. కేంద్రం రక్షణ కోరింది. ఆమె విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రం.. ఆమెకు "వై" కేటగిరీ భద్రను కల్పించింది. ఆ తర్వాత ముంబైకు వస్తున్నా.. దమ్ముంటే వచ్చి అడ్డుకోండి అంటూ సవాల్ విసిరింది. ఆ వెంటనే ముంబైకు బయలుదేరగా, ఆమె ముంబైకు చేరుకునేలోపు, ముంబైలోని ఆమె సినీ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఇంతలోనే ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది దేశ ద్రోహం కేసు. 
 
దీనిపై ట్విటర్‌ ద్వారా స్పందించిన కంగనా వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. 'నవరాత్రి వేళ ఎవరు ఉపవాసం ఉన్నారు? ఈ రోజు వేడుకల నుంచి ఫోటోలు ఇవి. ఇక నాపై మరొక కేసు నమోదైంది. మహారాష్ట్రలోని పప్పు సేన నాపై మక్కువతో ఎక్కువై పోయిందనిపిస్తుంది, నన్ను మిస్ అవ్వద్దు.. త్వరలోనే అక్కడకు వస్తాను' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇదిలావుంటే, తాజాగా ఆమెకు ఒడిశాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచారం బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉన్న కంగనా ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అయితే తన ఖాతా హ్యాక్ చేశారని సదరు న్యాయవాది అనంతరం ఓ పోస్ట్ చేశాడు. 
 
'ఈ రోజు నా ఫేస్‌బుక్ హ్యాక్ అయింది. అందులో నుంచి అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు చేశారు. స్త్రీలను, సమాజాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు నావి కాదు. వీటిని చూసి నేను కూడా చాలా షాక్ అయ్యాను. వీటి వల్ల ఎవరి మనోభావాలు అయిన దెబ్బతింటే నన్ను కక్షమించండి. అని కోరారు. అనంతరం తన ఫేస్‌బుక్ ఖాతాను తొలగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24న బాలయ్య నర్తనశాల రిలీజ్ : టిక్కెట్ ధర ఎంతంటే.....?