ఇండియన్ -2 నుంచి తప్పుకున్న ఐశ్వర్య!

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (13:13 IST)
విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇండియన్ -2 (భారతీయుడు-2). భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. అలాగే, ఆయన సరసన కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్‌లతో పాటు.. మరికొంతమంది ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో కౌస‌ల్య కృష్ణ‌మూర్తి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన ఐశ్వ‌ర్య రాజేష్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే, కోలీవుడ్ వర్గాల సమాచతారం మేరకు ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇతర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నందున, ఆమె ఇండియన్-2 ప్రాజెక్టుకు తన డేట్స్‌ను అడ్జెస్ట్ చేయలేకపోయినట్టు సమాచారం. 
 
కాగా, ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగు డెబ్యూ చిత్రం "కౌస‌ల్య కృష్ణ‌మూర్తి" ఈ రోజే విడుద‌ల కాగా, ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకెళుతుంది. రైతుల సమస్యను, క్రికెటర్‌గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేళ‌విస్తూ చిత్రాన్ని రూపొందించార‌ని క్రిటిక్స్ చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments