Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియ‌న్ 2 గురించి న్యూస్ నిజ‌మేనా..?

Advertiesment
ఇండియ‌న్ 2 గురించి న్యూస్ నిజ‌మేనా..?
, బుధవారం, 31 జులై 2019 (21:11 IST)
యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ భార‌తీయుడు. ఈ సినిమా ప్ర‌భావంతో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 రాబోతుంది. సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని ప్రారంభించారు. అయితే... కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. 
 
ఆ త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా ఆగ‌లేద‌ని ప్ర‌క‌టించ‌డం.. మ‌ళ్లీ ఆగిపోవ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఈ సంచ‌ల‌న చిత్రం గురించి ఓ ఇంట్ర‌ెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఆగ‌స్ట్ 19న షూటింగ్ మొద‌లు కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఆంధ్రప్ర‌దేశ్‌లోని రాజమండ్రిలో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట‌. 
 
ఈ చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ఐశ్వ‌ర్యారాజేశ్‌, ప్రియాభ‌వాని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ సీక్వెల్‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈసారైనా షూటింగ్‌కి బ్రేక్ ప‌డ‌కుండా పూర్త‌వుతుందా...? అని నెటిజ‌న్లు అడుగుతున్నారు. మ‌రి.. టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడుకునే సమయంలో అది మాత్రం చేయకుండా వుండను.... కాజల్ అగర్వాల్