Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనీ కిడ్నాప్ కాదట... ఎందుకో తెలిస్తే షాకే..?

సోనీ కిడ్నాప్ కాదట... ఎందుకో తెలిస్తే షాకే..?
, మంగళవారం, 30 జులై 2019 (21:27 IST)
రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ హయత్ నగర్‌కు చెందిన సోనీ కిడ్నాప్ వ్యవహారం ఎట్టకేలకు సుఖాంతమైంది. టీవీ ఛానళ్ళతో పాటు సోషల్ మీడియాలో సోనీ కిడ్నాప్ వ్యవహారం హల్ చల్ చేయడంతో కిడ్నాపర్ వెనక్కి తగ్గాడు. సోనిని సేఫ్‌గా దింపి పరారయ్యాడు. అయితే సోనీ తనని కిడ్నాప్ చేయలేదని, రవితో ఇష్టపూర్వకంగా వెళ్ళినట్లు పోలీసులు విచారణలో ఆమె తెలిపింది. దీంతో పోలీసులే షాకయ్యారు.
 
ఈనెల 23వతేదీన హైదరాబాద్ లోని హయత్ నగర్లో టీ షాపు యజమాని కుమార్తె సోని కిడ్నాప్‌కు గురైంది. బి.ఫార్మసీ చేసిన సోనీకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రవి అనే వ్యక్తి ఆమె తండ్రి, సోదరుడిని వెంట పెట్టుకుని కారులో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోకి తిప్పాడు. తెలంగాణా సెక్రటేరియట్‌తో పాటు కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలకు తీసుకెళ్లాడు.
 
అయితే ఇంటర్వ్యూకు మరికొన్ని సర్టిఫికెట్లు కావాలని.. మీరు వెళ్ళి తీసుకురండని సోని తండ్రి, సోదరుడిని దింపేసి సోనిని కారులోనే తీసుకెళ్ళాడు. అయితే సర్టిఫికెట్లు తీసుకొని రవికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మరుసటి రోజు ఉదయమైనా ఇంటికి వస్తారని అనుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఎంతకూ ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు సోనీ కుటుంబ సభ్యులు.
 
మొదట్లో ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నా.. కిడ్నాపర్ రవి మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ అని విజయవాడలో అతనిపై పలు కేసులు ఉన్నాయని గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ కేసును లోతుగా చేధించే ప్రయత్నం చేశారు. వరుసగా టివీల్లోను, సోషల్ మీడియాలోను సోనీ వార్తలే ప్రధానంగా రావడంతో కిడ్నాపర్ భయాందోళనకు గురయ్యాడు. సోనీని నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలి వెళ్లిపోయాడు. 
 
సోని ఒక్కటే బస్సులో హైదరాబాద్‌కు చేరుకుంది. ఎం.జి.బి.ఎస్.లో సోనీ ఒక్కటే కూర్చుని ఉండగా ఒక యువతి గుర్తుపట్టి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. పోలీసులు సోనీని హయత్ నగర్ పోలీస్టేషన్‌కు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తనను రవి కిడ్నాప్ చేయలేదని.. ఇష్టపూర్వకంగానే తాను వెళ్ళినట్లు విచారణలో సోనీ తెలిపింది. దీంతో పోలీసులే అవాక్కయ్యారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల్లో అభ్యర్థులకు వెసులుబాటు