Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెగ్నెన్సీ లేదు.. గాడిద గుడ్డూ లేదు : కాజల్ అగర్వాల్

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (15:30 IST)
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భందాల్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ గర్భందాల్చిందనీ అందుకే ముందుగా అంగీకరించిన ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది. 
 
ఇపుడు ఈ వార్తలపై కాజల్ అగర్వాల్ స్పందించారు. "ఈ విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సరైన సమయంలో దీని గురించి స్పందిస్తా" అని చెప్పింది. 
 
కాజల్​ చెల్లిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని చిత్రాల్లో నటించిన నిషా అగర్వాల్​ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్​బై చెప్పింది. ఆమెకు ఓ అబ్బాయి. అయితే కాజల్ కూడా​ త్వరగా తల్లి అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తెలిపింది.
 
ఈ విషయమై స్పందించిన 'చందమామ' భామ.. "ఈ విషయం నన్ను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. కానీ అదేసమయంలో ఒత్తిడికి కూడా లోనవుతా. నిషా జీవితం ఎలా మార్పు చెందుతూ వచ్చిందో చూశా. ఆమె జీవితానికి పరిపూర్ణత వచ్చింది. తల్లిగా మారడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఆ దశలో సెల్ఫ్​ రియలైజేషన్​ అవుతారని అనుకుంటా. 
 
అయినా నిషా కుమారుడుతో ఉన్నప్పుడు నన్ను నేను ఓ తల్లిగా భావిస్తా. ఇప్పుడు మా ఇంట్లో మియా(పెంపుడు కుక్క) వచ్చాక కూడా.. నేను, గౌతమ్​ తల్లిదండ్రులుగా ఫీల్​ అవుతున్నాం. నాకు సొంత పిల్లలు పుట్టినప్పుడు ఈ ఎమోషన్​ ఇంకా ఎక్కువ అవుతుందనుకుంటా" అని కాజల్​ చెప్పింది. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments