అర్చన. తెలుగు నటీమణుల్లో ఓ స్థాయిలో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. అడపాదడపా సినిమాల్లో నటించిన ఈ భామ ఆమధ్య బిగ్ బాస్ షోలోనూ మెరిసింది.
ఇదిలావుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఓ డైరెక్టర్ తనను చాలా ఇబ్బంది పెట్టాడని బాంబు పేల్చింది అర్చన. సీన్ చేసేటపుడల్లా తనను బాగా ఇరిటేట్ చేసేవాడని తెలిపింది. ఓ రోజు నేరుగా తన ఇంటికే వచ్చి తన బ్రెయిన్ వాష్ చేసాడని, దాంతో నేను చేసేదే తప్పేమోనని ఆలోచనలో పడినట్లు తెలిపింది.
ఆ తర్వాత మళ్లీ షూటింగుకి వెళితే... యధావిధిగా అతడి వెకిలి చేష్టలు చేయడం మొదలుపెట్టాడనీ, దాంతో నాకు పైసా కూడా వద్దని ముఖం మీదే చెప్పేసి వచ్చానని వెల్లడించింది. ఈయనతోపాటు ఓ నటుడు కూడా తన పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించేవాడంటూ చెప్పింది. కానీ వాళ్లెవరో మాత్రం వెల్లడించలేదు.