తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్‌లో కాక పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, మంచు విష్ణు, హేమలు వేర్వేరుగా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. దీంతో ఒకరిపై ఒకరు చేసుకుంటోన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు నరేశ్‌పై తాజాగా సినీ నటి హేమ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాలని కొందరు భావిస్తున్నారంటూ ఆమె తాజాగా ఆరోపించారు. లేదంటే ఎన్నికలు లేకుండా నరేశ్‌నే మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారు ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారని అన్నారు.
అదేసమయంలో నరేష్ కూడా మా అధ్యక్ష పదవి నుంచి దిగకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అదేసమయంలో మా నిధుల ఖర్చులో కూడా దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు.
మొత్తం రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే నరేశ్ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగిలన రూ.2 కోట్ల నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఈ విషయమై 200 మంది అసోసియేషన్ సభ్యులకు హేమ లేఖలు రాశారు. అలాగే, మా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఆమె గట్టిగా కోరారు.