Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కోర్కె నెరవేరాక చనిపోయినా ఫర్వాలేదు : సూపర్ స్టార్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా చిత్రం "కాలా" ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Webdunia
గురువారం, 10 మే 2018 (11:42 IST)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా చిత్రం "కాలా" ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. ఇందులో రజనీకాంత్ తన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన భార్య లతా రజనీకాంత్, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్‌లతో కలిసి రజనీ ఈ కార్యక్రమానికి వచ్చారు.
 
ఈసందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, తాను తరచూ హిమాలయాలకు వెళ్లడానికి కారణమేంటని చాలా మంది అడుగుతూ ఉంటారు. గంగానది రౌద్రాన్ని, అందాన్ని చూడటానికే తాను హిమాలయాలకు వెళ్లి వస్తుంటానని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఈ పని ముగిసిన తర్వాత చనిపోయినా ఫర్వాలేదని సూపర్ స్టార్ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, 'శివాజీ' సక్సెస్ మీట్‌కు అతిథిగా వచ్చిన డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పిన మాటలు తనకు ఇంకా వినిపిస్తున్నాయని, ఆయన మాట కోసం తాను కూడా అందరిలో ఒకడిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఈ ఫంక్షన్ ఆడియో వేడుకలా లేదని, సినిమా విజయోత్సవ సభలా అనిపిస్తోందన్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments