దక్షిణ భారతదేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడమే లక్ష్యం: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ నదుల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో వున్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రజనీకాంత్ ప్రకటించారు. దక్షిణ భారతంలోని నదుల అనుసంధానం ముగిశాక
సూపర్ స్టార్ రజనీకాంత్ నదుల అనుసంధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో వున్న నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రజనీకాంత్ ప్రకటించారు. దక్షిణ భారతంలోని నదుల అనుసంధానం ముగిశాక చనిపోయినా ఫర్వాలేదని రజనీకాంత్ తెలిపారు. 'కాలా' ఆడియో లాంఛ్ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్.. రాజకీయాలపై ప్రత్యక్షంగా కామెంట్స్ చేయలేదు.
కానీ రాజకీయ అంశాలను పరోక్షంగా ప్రస్తావించారు. తాను తరచూ హిమాలయాలకు వెళ్లడానికి కారణమేంటని చాలామంది అడుగుతూ వుంటారని.. అందుకు కారణం గంగానదేనని రజనీకాంత్ తెలిపారు. గంగానది రౌద్రాన్ని, అందాన్ని చూడటానికే తాను హిమాలయాలకు వెళ్లి వస్తుంటానని రజనీకాంత్ చెప్తుంటారు.
కాలా ఆడియో విడుదల కార్యక్రమం.. ఆడియో లాంఛ్‌లా లేదని.. సినిమా విజయోత్సవ సభలా అనిపిస్తోందని చెప్పారు. ''శివాజీ'' సక్సెస్ మీట్‌కు అతిథిగా వచ్చిన కరుణానిధి చెప్పిన మాటలు తనకు ఇంకా వినిపిస్తున్నాయని, ఆయన మాట కోసం తాను కూడా అందరిలో ఒకడిగా ఎదురు చూస్తున్నానని వెల్లడించారు.