Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కంటతడి.. అలా వాడుకున్న రామ్ గోపాల్ వర్మ (Video)

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (12:13 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కంటతడి పెట్టడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతుండగా.. ఆర్జీవీ కూడా తన మార్కును చూపెట్టాడు.

ఇంకా బాబు కంటతడికి అసలు కారణం చెప్పాడు. అంతేగాకుండా   చంద్రబాబు కంటతడిని తన సినిమా ప్రమోషన్‌గా మార్చేసుకొని చంద్రబాబు ఏడుపుకు కారణం తన సినిమా ట్రైలర్ అని చెబుతూ సరికొత్తగా సెన్సేషన్ క్రియేట్ చేశారు.
 
 
ఈ మేర‌కు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ చంద్రబాబు కంటతడి పెట్టుకోవడానికి కారణం తన సినిమా 'ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ రియాక్షన్ ఇచ్చినందుకు బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పారు వర్మ.

ఇక ఆర్జీవీ షేర్ చేసిన ఆ వీడియో చూస్తే.. చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి మిమిక్రీ వాయిస్‌లో బాబు మాటల్లోనే 'ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు' అని చెప్పడం, ఆ తర్వాత చంద్ర‌బాబు కన్నీళ్లు పెట్టుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనుకావడం చూడొచ్చు. ఇది చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 
 
 
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి కంటతడి పెట్టుకున్న సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేయడం జనాల్లో పలు చర్చలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments