Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు అడ్డుపెట్టుకుని చంద్రబాబు కన్నీళ్లు: బాల‌కృష్ణ స‌మాధానికి అభిమానుల అసంతృప్తి

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (11:45 IST)
Balakrishana ph
ప్ర‌స్తుతం వై.ఎస్‌. జ‌గ‌న్ కీ, చంద్ర‌బాబునాయుడుకి మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. త‌న భార్య‌ను చుల‌క‌న‌గా శాస‌న‌స‌భ‌లో మాట్లాడినందుకు బాధ‌ప‌డి కంట‌త‌డి పెట్టిన చంద్ర‌బాబు ఇక‌పై శాస‌న‌స‌భ‌కు రాన‌ని తేల్చిచెప్పారు.

 
- కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండ‌గా అస‌లు శాస‌న‌స‌భ‌కే రాని జ‌గ‌న్ గురించి అస్స‌లు మాట్లాడ‌క‌పోవ‌డం విశేష‌మే. కానీ ఇప్పుడు ఆ వంతు చంద్ర‌బాబుకు వచ్చింది. ఇది ఇద్ద‌రి స‌మ‌స్య అని కొంద‌రు భావిస్తే, ఇది రాష్ట్రంలోని ఆడ‌ప‌డ‌చులను కించ‌ప‌ర్చ‌డ‌మే అని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 
ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న సోష‌ల్‌మీడియాలో చాలా సాఫ్ట్‌గా స‌మాధానం చెప్పారు. ఆయ‌న ఏమ‌న్నారంటే, రాజకీయంలో విమర్శలు సర్వసాధారణం కానీ, రాజకీయానికి సంబంధం లేని ఇంటి ఆడపడుచును విమర్శించే తీరు సరికాదు దాన్ని మార్చుకోవడం మానుకోవటం మంచిది అని పేర్కొన్నారు.
 

కానీ కొంద‌రు అభిమానులు ఇదేమిట‌న్నా ఇలా మాట్లాడావంటూ, ఎంటి అన్నా ఇంత నార్మల్‌గా సమాధానం చెపుతున్నారు .. మీరు చెప్పే సమాధానానికి వాళ్లకు గుబ్బ గుయ్‌మనాలి, అలా వుండాలి బాలయ్య బాబు గారు మీ సమాధానం. వైసీపీ నాయకులకు గుండెల్లో రైళ్ళు ప‌రుగెత్తాలి అన్న‌ట్లుగా చెప్పాలి, కానీ మీరేంటి అయినట్లు పొయినట్లు చెప్పారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్షాలు - ఏకంగా 38 రైళ్లు రద్దు

కర్నాటకలో వింత - నీలి రంగు గుడ్డు పెట్టిన కోడి

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments